• TELUGU

  • ENGLISH

  • PLAY MEDIA

"యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు." కీర్తన 1

1. దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గములయందు నిలిచియుండక
|| దుష్టుల ||

2. అపహాసించునట్టి ప్రజల కూర్చుండెచు
ఆ చోట కూర్చుండక యుందువాడే ధన్యుడు
|| దుష్టుల ||

3. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు
యెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు
|| దుష్టుల ||

4. కాలువ నీటియోర నతడు నాటబడి
కాలమున ఫలించు చెట్టువలె యుండును
|| దుష్టుల ||

5. ఆకు వాడని చెట్టువలె నాతడుండును
ఆయన చేయునదియెల్ల సఫలమగును
|| దుష్టుల ||

6. దుష్టజనులు ఆ విధముగా నుండక
పొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు
|| దుష్టుల ||

7. న్యాయ విమర్శ సభల యందు దుష్టజనులు
నీతిమంతుల సభలో పాపులును నిలువరు
|| దుష్టుల ||

8. నీతిమంతుల మార్గము యెహోవా ఎరుగును
నడుపును దుష్టుల దారి నాశనమునకు
|| దుష్టుల ||


You may also like